పురస్కారమే లక్ష్యం

0
5


పురస్కారమే లక్ష్యం

70 మార్కులు.. రూ.9 లక్షలు 

18, 19వ తేదీల్లో పరిశీలనకు రానున్న కేంద్ర బృందం

న్యూస్‌టుడే, ఎడపల్లి

ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తోన్న ‘లక్ష్య’ పురస్కారానికి ఎడపల్లి ప్రాథమిక కేంద్రం ఎంపికైంది. ఏప్రిల్‌ 12న రాష్ట్ర బృందం ఆసుపత్రిని సందర్శించగా ఈ నెల 18, 19 తేదీల్లో జాతీయ బృందం పరిశీలనకు రానుంది. 6 అంశాలను పక్కాగా అమలు చేస్తేనే ఈ పురస్కారం కింద రూ.9 లక్షలు మంజూరవుతాయి. ఒక్కో అంశానికి 70 మార్కులు వస్తేనే దవాఖానా నాణ్యత ప్రమాణాల పెంపునకు ఏటా రూ.3 లక్షల చొప్పున మూడేళ్ల పాటు అందనున్నాయి.

రోగులకు మెరుగైన సేవలందించడం, పచ్చదనం, పరిశుభ్రత, ప్రసవాలు, ల్యాబ్‌, ఇన్‌పేషంట్ల పట్ల జాగ్రత్త వహించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొంటారు. 14 జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మఒడి, కేసీఆర్‌ కిట్‌ తదితర సేవలను సక్రమంగా అమలు చేయాల్సి ఉంటుంది.

కొత్త హంగులు..

ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్త హంగులు దిద్దుకుంటోంది. కేంద్ర బృందం పరిశీలనకు రానున్న నేపథ్యంలో ఆసుపత్రిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి వార్డును శుభ్రంగా ఉంచడంతో పాటు రోగులను ఆకట్టుకొనేలా పరిసరాలను ముస్తాబు చేస్తున్నారు.

ఆసుపత్రి గోడలకు రంగులు వేస్తున్న కార్మికుడు 

అభివృద్ధి దిశగా..

– జవేరియా సుల్తానా, ఆసుపత్రి వైద్యాధికారిణి

లక్ష్య పురస్కారం రావాలని ఆకాంక్షిస్తున్నాం. డీఎంహెచ్‌వోతో పాటు రాష్ట్ర అధికారులు ఇందుకు కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయి అధికారులు సంతృప్తి చెందితే నిధులొస్తాయి. తద్వారా ఆసుపత్రి అభివృద్ధి చెందడంతో పాటు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసే వీలుంటుంది. రోగులకు మెరుగైన సేవలను స్థానికంగానే అందించే అవకాశం ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here