పూర్వ విద్యార్థుల సమ్మేళనం

0
5


పూర్వ విద్యార్థుల సమ్మేళనం


ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

నిజామాబాద్‌ సిటీ, న్యూస్‌టుడే: నగరంలోని సీఎస్‌ఐ హైస్కూల్‌కు చెందిన 1996-97 బ్యాచ్‌ పదోతరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం గూపన్‌పల్లిలోని ఓ కల్యాణ మంపడంలో ఆదివారం నిర్వహించారు. 23 ఏళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో తెలుసుకొన్నారు. కుటుంబసభ్యులను పరిచయం చేశారు. అనంతరం వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు జీవన్‌, కేశవ్‌కుమార్‌, సుధీర్‌, దేవ్‌పాల్‌, పద్మ, స్వర్ణలతను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్‌, అభినందన్‌, అమ్జద్‌, ఇంతియాజ్‌, అజీజ్‌, మనోజ్‌, బాల్‌రాజ్‌, శివప్రసాద్‌, ఝాన్సీ, సుచరిత తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here