పూల్ గేమ్‌ను తిలకించేందుకు వచ్చిన స్పెషల్ గెస్ట్.. ఆదమరిస్తే ప్రాణాలు పోయేవి..!

0
0


పూల్ గేమ్‌ను తిలకించేందుకు వచ్చిన స్పెషల్ గెస్ట్.. ఆదమరిస్తే ప్రాణాలు పోయేవి..!

బ్రిస్బేన్‌లో కొందరు పూల్ గేమ్ ఆడుతుండగా మరో ఆటగాడు అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అయితే ఆ ఆటగాడు ఆట ఆడేందుకు రాలేదు.. ఆట వీక్షించేందుకు వచ్చినట్లుగా కనిపించాడు. కానీ ఈ ఆటగాడిని చూసిన వారు భయంతో పరుగులు తీశారు. ఇంతకీ ఆ ఆటగాడెవరో తెలుసా..?

బ్రిస్బేన్‌లో కొందరు స్నేహితులు పూల్‌గేమ్ ఆడుతున్నారు. వారు ఆడుతున్న సమయంలో పూల్ టేబుల్ కింద నుంచి ఏదో చప్పుడు. పూల్ బాల్ వెళ్లి ఆ రంద్రంలో పడినప్పుడు తిరిగి పైకి వస్తోంది. దీంతో ఏంటా అని వారంతా ఆ రంద్రం వైపు చూశారు. అంతే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పూల్ టేబుల్‌కు ఉన్నరంద్రం కింద పెద్ద పాము ఒకటి సేద తీరింది. ఇది చూసిన స్నేహితులు భయంతో కేకలు వేశారు.

పామును పూల్ టేబుల్ కింద చూడగానే పాములు పట్టే వాడికి ఫోన్ చేశారు. పాములు పట్టేవాడు వచ్చి పామును జాగ్రత్తగా బయటకు తీశాడు. పూల్ టేబుల్‌కు ఉన్న రంద్రంలో బాల్‌కోసం చేయి పెట్టే ముందు ఒకసారి చెక్ చేయాలని పాములు పట్టే అతను సూచించాడు. ఇక పాము టేబుల్‌ కింద ముడుచుకుని సేదతీరడాన్ని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. చాలామంది జంతు ప్రేమికులు పాము ఎంత ముద్దుగా ఉందో అని కామెంట్ చేయగా మరికొందరు మాత్రం చాలా భయంకరంగా ఉందంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన కొన్ని గంటలకే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒకేసారి 3900 షేర్లు రాగా… 2300 మంది కామెంట్ చేశారు.

ఈ పైథాన్ కార్పెట్ పైథాన్ అని ఎలైట్ స్నేక్ క్యాచర్స్ సంస్థ పేర్కొంది. ఇవి రెండు నుంచి 4 అడుగులు పొడవు ఉంటాయని తెలిపారు. ఇవి ఇంట్లో తిరిగే పిల్లులను, కుక్కలను చంపుకు తింటాయని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here