పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రియంబర్స్‌ ఫీజులను స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్‌ చేశారు. విద్యాసంవత్సరం పూర్తయినప్పటికీ గత విద్యా సంవత్సరానికి సంబంధించిన బీసీ, ఎస్సి, ఎస్టి, మైనారిటీ, ఈబిసి స్కాలర్‌ షిప్‌లను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు. కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ వారికి సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. స్కాలర్‌షిప్‌లు రాలేదు కావున విద్యార్థులకు ఇవ్వడం లేదని అంటున్నారన్నారు. వారు ఉన్నత విద్యను చదువుకోవడానికి అవకాశాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెండింగ్‌లో ఉన్న అన్ని రకాలైన రియంబర్స్‌మెంట్‌ ఫీజులను స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here