పెంపుడు కుక్కలను ఎత్తుకెళ్లాయని చిరుత పులులను విషం పెట్టిన చంపిన ఘనుడు..!

0
0


పెంపుడు కుక్కలను ఎత్తుకెళ్లాయని చిరుత పులులను విషం పెట్టిన చంపిన ఘనుడు..!

పెంపుడు కుక్కలపై దాడి చేసి చంపివేశాయని విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి మూడు చిరుత పులులను చంపివేశాడు. దాడి చేసిన కుక్కల శవాలపై విష పదార్థం చల్లాడు. దీంతో చనిపోయిన కుక్కను తిన్న మూడు చిరుత పులులు మృత్యువాత పడ్డాయి.

మనిషి విచక్షణ కోల్పోతే ఎలా ప్రవర్తిస్తాడో అంతుపట్టని పరిస్థితి నెలకొంటుంది. అది తోటి మనుష్యులైన లేదా నోరు లేని జంతువులని కూడ చూడకుండా వ్యవహరిస్తాడు. ఈ నేపథ్యంలోనే తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కలపై చిరుత పులులు దాడి చేశాయని వాటిని విషం పెట్టి చంపాడు. హరిద్వార్‌కు చెందిన సుఖ్‌పాల్ అనే వ్యక్తి రెండు కుక్కలను పెంచుకున్నాడు. అయితే వాటిపై రాజాజీ నేషనల్ పార్క్‌లో ఉన్న చిరుత దాడి చేసి ఎత్తుకెళ్లాయి. ఇలా రెండు కుక్కలను కూడ చిరుతలు ఎత్తుకుపోయాయి.

దీంతో చిరుతలపై కక్ష పెంచుకున్న సుఖ్‌పాల్ వాటిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చనిపోయిన కుక్కపై నర్సరీల్లో వాడే పురుగుమందులను ఎక్కువమోతాదులో చనిపోయిన కుక్కపై పోసి, దాన్ని చిరుతలు ఉండే ప్రాంతంలో పడేశాడు.దీంతో చనిపోయిన కుక్కను తిన్న మూడు చిరుతలు చనిపోయాయి. అయితే చిరుత మరణంపై పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు విషం తినడంతో చనిపోయాయని నిర్ధారించారు. దీంతో విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు సుఖ్‌పాల్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరోవైపు సుఖ్‌పాల్ భార్య ఫారెస్ట్ ‌నర్సరీలోని తాత్కలిక ఉద్యోగిగా చేస్తోందని పోలీసులు తెలిపారు..కేసు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడడంతో కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here