పెంపుడు శునకానికి పురుడు వేడుక

0
2


పెంపుడు శునకానికి పురుడు వేడుక


కోనసముందర్‌లో శునకానికి పురుడు వేడుక నిర్వహిస్తున్న లావణ్య

కోనసముందర్‌(కమ్మర్‌పల్లి), న్యూస్‌టుడే: కోనసముందర్‌లో గుండాజీ లావణ్య అనే మహిళ తన పెంపుడు శునకానికి ఇంట్లో బుధవారం పురుడు వేడుక నిర్వహించారు. ఐదు రోజుల క్రితం పెంపుడు కుక్క ఆరు పిల్లలను ప్రసవించింది. దీంతో కాలనీ వాసులను పిలిచి శాస్త్రోక్తంగా పురుడు వేడుక జరిపించింది. అనంతరం మక్క గుడాలతో విందు ఏర్పాటు చేసింది. కుటుంబ సభ్యురాలిగా విశ్వాసంతో మెలిగే శునకం కావడంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు లావణ్య సంతోషం వ్యక్తం చేశారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here