పెడ్ రేట్ కట్ తర్వాత భారీ నష్టాల్లో మార్కెట్లు ఎందుకు?

0
0


పెడ్ రేట్ కట్ తర్వాత భారీ నష్టాల్లో మార్కెట్లు ఎందుకు?

న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 11,000 దిగువకు వచ్చింది. మెటల్, మీడియా, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. ప్రమోటర్ వాటా 11 శాతం వాటా విక్రయం కారణంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ టాప్ లూజర్‌గా నిలిచింది. వేదాంత, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిండాల్కో, టాటా మోటార్స్, యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్ టెల్, విప్రో, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వీసెస్ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఎస్బీఐ ఆరు శాతం మేర నష్టపోయింది.

యూఎస్ ఫెడరల్ బ్యాంకు బుధవారం సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ సమయంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన కామెంట్స్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో యూఎస్ మార్కెట్ నిలువునా పతనమైంది. సమీక్ష సందర్భంగా ఫెడ్ చైర్మన్ మాట్లాడుతూ.. సుదీర్ఘ రేట్ కట్ సైకిల్‌కు తాజా నిర్ణయం ఆరంభం కాదన్నారు. తద్వారా ప్రస్తుత తగ్గింపు తర్వాత రేట్ కట్స్ ఉండకపోవచ్చునని వెల్లడించారు.

ఫెడ్ చైర్మన్ మాటలు పదేళ్ల తర్వాత తీసుకున్న రేట్ కట్ నిర్ణయ సంబరాలను ఆవిరి చేశాయని చెబుతున్నారు. ఇది మార్కెట్లో సెంటిమెంట్‌పై నెగిటిన్ ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో డౌజోన్స్, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ పతనమయ్యాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్ల పైన కూడా పడింది.

అయితే ఫెడ్ చైర్మన్ ఇది చివరి రేట్ కట్ అని చెప్పలేదని, మార్కెట్లు అనవసరంగా నెగిటివ్‌గా తీసుకున్నాయని మరికొందరు చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలతో డాలర్ బలపడటం వర్ధమన మార్కెట్లకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. మొత్తానికి పెడ్ రేట్ కట్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలతో అమెరికా, ఆసియా మార్కెట్లతోపాటు ఇండియన్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here