పెళ్లికూతురు కాదు.. నోరూరించే కేక్!

0
4


పెళ్లికూతురు కాదు.. నోరూరించే కేక్!

పెళ్లికూతురు కాదు.. నోరూరించే కేక్!

లండన్‌: పై ఫొటోలో కన్పిస్తున్న పెళ్లికూతురిని చూశారా? ఒంటినిండా నగలు, మేకప్‌తో అందంగా ఉంది కదూ.. కానీ ఆమె నిజమైన పెళ్లికూతురు కాదు. షోకేస్‌లో పెట్టిన నోరూరించే కేక్‌. నమ్మబుద్ధికావడంలేదు కదా? కానీ ఇది అక్షరాలా నిజం. యూకేకు చెందిన ఎమ్మా జేన్‌ ఈ అందమైన కేక్‌ను తయారుచేశారు. ఎమ్మాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఆమె తయారుచేసే కేక్‌ డిజైన్లన్నీ చూడ్డానికి నిజమైన ఆకృతులేననిపిస్తాయి. ఓసారి ఎమ్మా గుర్రం కూర్చున్నట్లుగా ఉన్న పోజ్‌లో ఓ కేక్‌ను రూపొందించారు.

పెళ్లికూతురు కాదు.. నోరూరించే కేక్!

దానిని ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శించినప్పుడు వీక్షకులు దానిని నిజమైన గుర్రం బొమ్మ అనుకున్నారట. అది కేక్‌ అని తెలిసి దానితో తెగ సెల్ఫీలు దిగేశారు. 2012 నుంచి ఎమ్మా బేకింగ్‌ వృత్తిలో ఉన్నారు. వస్తువుల ఆకారంలో ఉన్న కేక్‌లనే కాదు సెలబ్రిటీల ఆకారంలో ఉన్న కేక్‌లను ఇట్టే రూపొందించేస్తారు. అబర్‌డేర్‌ ప్రాంతంలో ఎమ్మాకు వర్క్‌షాప్‌ కూడా ఉంది. యూరప్‌లో బేకర్‌గా ఎమ్మాకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. అక్కడి పాఠశాలలు, కళాశాలల్లో ఎమ్మా చేత బేకింగ్‌లో శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఎమ్మా రూపొందించిన కేక్‌లలో ప్రపంచంలోనే ఉత్తమమైన కేక్‌లుగా అవార్డు అందుకున్న డిజైన్లు ఇవే..!

పెళ్లికూతురు కాదు.. నోరూరించే కేక్!

పెళ్లికూతురు కాదు.. నోరూరించే కేక్!

పెళ్లికూతురు కాదు.. నోరూరించే కేక్!

Tags :

  • null



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here