పేకాటరాయుళ్ళ అడ్డా…

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వం సాంకేతిక కళాశాల పేకాట రాయుళ్లు, ఆకతాయిలకు అడ్డాగా మారింది. వివరాల్లోకి వెళ్తే నందిపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ సాంకేతిక కళాశాల గతంలో బాలికల హాస్టల్‌ కోసం భవన నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ప్రభుత్వ సాంకేతిక కళాశాలకు భవనం లేనందున కొన్నిరోజుల పాటు ఉపయోగంలోకి తీసుకున్నారు. తర్వాత కళాశాలకు నూతన భవనం నిర్మాణం పూర్తి కాగానే అందులోకి మార్చుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది కాని… నాడు బాలికల హాస్టల్‌ కోసం నిర్మించబడిన భవనం కాస్త నిర్మానుష్యంగా మారింది. అప్పటి నుండి భవనాన్ని గాలికొదిలేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించిన ప్రభుత్వ భవనాలు కాస్త ఇప్పుడు పేకాట రాయుళ్లకు అడ్డగా మారింది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా, అక్కడే పేకటరాయుళ్లు మకాం వేస్తున్నారు. పేకాట ఆడటం మొదలుపెట్టారు. దానికితోడు మధ్యం సేవించడం, మల మూత్ర విసర్జన చేయటం, మద్యం మత్తులో పభుత్వ ఆస్తులని కూడా చూడకుండా, భవనంలోని మరుగుదొడ్లను ధ్వంసం చేయటం లాంటి ఆకతాయి పనులు చేస్తున్నారు. త్రాగునీరు కోసం వేసిన బోరుబావిలో మోటారు కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారని, దగ్గరలోనే బస్తి వాసులు నివసించడం వలన తమ పిల్లలు చుట్టుపక్కల సంచరించడం జరుగుతుందని, తమ పిల్లలపై దుష్ప్రభావాన్నీ చూపే అవకాశముందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here