పేదల ఆపద్భాంధవుడు కెసిఆర్‌

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదల ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అసెంబ్లీ ప్యానెల్‌ స్పీకర్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. బిచ్కుంద మండలంలోని గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాలుగా అభివద్ధి పథకాలు గడపగడపకు అందడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాలనలో గ్రామాల అభివద్ధి జరుగుతుందన్నారు. 60 సంవత్సరాలలో కాని అభివద్ధి పనులు కేసీఆర్‌ పాలనలో జరుగుతున్నాయని చెప్పారు. నిరుపేద ఆడపడుచుల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా ఒక లక్ష 116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా జుక్కల్‌, బిచ్కుంద, పిట్లం గ్రామాల్లో పంటపొలాలు పండేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి నాయకులు తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here