పేదల సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయం: ఎమ్మెల్యే

0
0


పేదల సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయం: ఎమ్మెల్యే

డిచ్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం శ్రమిస్తూనే, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ చెప్పారు. మంగళవారం డిచ్‌పల్లిలోని కేఎన్‌ఆర్‌ గార్డెన్‌లో రూరల్‌ నియోజకవర్గం డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, నిజామాబాద్‌, మోపాల్‌, ఇందల్‌వాయి మండలాల లబ్ధిదారులు(కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎం సహాయనిధి) 726 మందికి రూ.7.12 కోట్ల చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రూ.2650 కోట్లతో ఏడు మండలాల్లోని 175 గ్రామాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి పైపులైన్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. గతంలో పేదలు పెళ్లి చేయాలన్న, వైద్యం చేయించుకోవాలన్నా నానా అవస్థలు పడేవారని, కేసీఆర్‌ భరోసాతో వారు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచిన అర్వింద్‌ జిల్లాను అభివృద్ధి చేయకుండా సీఎం కేసీఆర్‌ను విమర్శించడం తగదన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏడు మండలాల ఎంపీపీలు భూమన్న, రమేష్‌, సారిక, లత, అనిత, అనుష, జడ్పీటీసీ సభ్యులు జగన్‌, సుమనారెడ్డి, ఇందిర, తనూజరెడ్డి, మాన్‌సింగ్‌, కమల, పార్టీ మండలాధ్యక్షులు రాములు, శ్యాంరావు, కృష్ణ, సాయిలు, నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, తహసీల్దారు అయ్యప్ప, ఎంపీడీవో సురేందర్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here