పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

0
1


పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

గొడుగుమర్రితండాలో చీరలు పంపిణీ చేస్తున్న ప్రజాప్రతినిధులు

అన్నారం(రామారెడ్డి), న్యూస్‌టుడే: పేదల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయమని సర్పంచి కూడలి అమృత అన్నారు. శనివారం అన్నారంలో బతుకమ్మ చీరలను ఆమె పంపిణీ చేశారు. గ్రామానికి 1433 చీరలు వచ్చినట్లు పేర్కొన్నారు. గొడుగుమర్రి తండా, భట్టుతండా, జగదాంబతండాలో ఎంపీపీ దశరథ్‌రెడ్డి పంపిణీ చేశారు. తెరాస మండలాధ్యక్షుడు వంచ గోపాల్‌రెడ్డి, సర్పంచులు శవంత, రాజు, లలిత, నాయకులు బాల్‌రాజు, మురళి, స్వామిగౌడ్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here