పొలార్డ్ నాకు సోదరుడు.. అతని బలమేంటో నాకు తెలుసు: భారత బౌలర్

0
1


గయానా: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కిరణ్ పొలార్డ్‌ నాకు సోదరుడు లాంటి వాడు. అతని బలం నాకు తెలుసు అని భారత స్పిన్నర్ కృనాల్ పాండ్యా చెప్పారు. శనివారం జరిగిన చివరిదైన మూడో టీ20లో రిషబ్‌ పంత్‌ (65 నాటౌట్‌; 42 బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (59; 45 బంతుల్లో 6×4) బ్యాట్‌ ఝళిపించడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది.

‘ప్రతి ఓవర్ మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా’

సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన:

సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన:

తొలి టీ20లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఛేదనలో కీలక సమయంలో 12 పరుగులు కూడా చేసాడు. రెండో టీ20లో ఇన్నింగ్స్ చివరలో 20 పరుగులు చేసి.. కీలకమైన రెండు వికెట్లు (రోమన్‌ పావెల్‌ (54; 34 బంతుల్లో 6×4, 3×6).. నికొలస్‌ పూరన్‌ (34 బంతుల్లో 19; 1 ఫోర్‌)) ఖాతాలో వేసుకున్నాడు. ఇక మూడో టీ20లో బౌలింగ్‌లో మోస్తరుగా రాణించాడు. అయితే రెండో టీ20లో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడం, భారీ భాగస్వామ్యాన్ని విడదీయడంతో భారత్.. భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 22 పరుగుల తేడాతో నెగ్గింది. సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేయడంతో పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది.

 పొలార్డ్ నాకు సోదరుడు :

పొలార్డ్ నాకు సోదరుడు :

అవార్డుల ప్రదానోత్సవంలో కృనాల్ పాండ్యా మాట్లాడుతూ… ‘నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నా. టీమిండియా సిరీస్ గెలవడంతో నా పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నా. ప్రతిరోజూ నా ఆటను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టాను. అంతకుమించి నేను దేని గురించి పెద్దగా ఆలోచించడం లేదు. మంచి ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా. పొలార్డ్ నాకు సోదరుడు లాంటివాడు, అయితే తనకి వ్యతిరేకంగా ఆడుతున్నా. అతని బలం నాకు తెలుసు, నా బలం అతనికి తెలుసు. ఇద్దరిలో మెదడును ఎవరు ఉపయోగిస్తారో వారే పైచేయి సాధిస్తారు’ అని పాండ్యా పేర్కొన్నాడు.

ఆర్మీలో విధులు.. అమితాబ్ పాటతో తోటి సైనికులను అలరించిన ధోనీ

మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా:

మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా:

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీపక్‌ చాహర్‌ మాట్లాడుతూ… ‘వాతావరణం చాలా బాగుంది. వాతావరణం, పిచ్ అనుకూలంగా ఉన్నందున బంతిని స్వింగ్ చేయడానికి ప్రయత్నించా. తేమ కారణంగా బంతిని రెండు వైపులా చేయడానికి కూడా ప్రయత్నించా. పరిస్థితుల కారణంగా అవుట్-స్వింగర్స్ కంటే ఎక్కువగా ఇన్-స్వింగర్స్ వేసాను. ఇన్-స్వింగర్స్ ఆడడం బ్యాట్స్‌మన్‌కు కొంచెం కష్టమే. సాధారణంగా పాత బంతులతో నెట్స్‌లో బౌలింగ్ చేస్తా. దీంతో నా బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటా. ఒకవేళ బంతి బాగా స్వింగ్ అవుతున్నప్పుడు వైవిధ్య బంతులు వేయను. ప్రతి ఓవర్ మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా. అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తా’ అని చాహర్‌ తెలిపాడు.

వన్డే సమరం:

వన్డే సమరం:

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో చేజిక్కించుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ గురువారం నుంచి ఆరంభం కానుంది. అనంతరం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ జరుగనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here