పోడు భూముల్లో పేదలకు న్యాయం చేయాలి

0
3


పోడు భూముల్లో పేదలకు న్యాయం చేయాలి

ఇందల్‌వాయి: పోడు భూముల విషయంలో పేదలకు న్యాయం చేయాలని మండల ప్రజాప్రతినిధులు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు విన్నవించినట్లు ఎంపీపీ రమేష్‌నాయక్‌ గురువారం తెలిపారు. రూరల్‌ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌ల సహకారంతో జడ్పీటీసీ సభ్యురాలు సుమనారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హైదరాబాద్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గౌరారం, రావుట్ల బీట్ల పరిధిలో గిరిజనులకు, అటవీశాఖ అధికారులకు తలెత్తిన వివాదాలను వివరించినట్లు ఎంపీపీ వివరించారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో పాటు రైతుల సమక్షంలో సంయుక్త సర్వే నిర్వహించే వరకు కందకాల తవ్వకం నిలిపివేయించాలని కోరామన్నారు. అందుకు కేటీఆర్‌ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. వెంట వైస్‌ ఎంపీపీ అంజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మోహన్‌నాయక్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ గోపాల్‌, ఎంపీటీసీ సభ్యులు దాసు, సర్పంచులు, నాయకులు ఉన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here