పోలీసులపై పెట్రోల్ పోసిన దొంగ.. ప్రాణాల కోసం పరుగు!

0
1


‘పెట్రోల్’.. మొన్నటి వరకు ధరల రూపంలో వణికించిన ఈ ఇంధనం, ఇప్పుడు ప్రాణభయంతో పరుగులు పట్టించేలా చేస్తోంది. కొద్ది రోజుల కిందట తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత పెట్రోల్ పేరు ఎత్తితే చాలు.. ప్రభుత్వ అధికారులు భయాందోళనలకు గురవ్వుతున్నారు. అవినీతి అధికారుల వేధింపులను తట్టుకోలేని కొందరు బాధితులైతే.. ‘‘ఇకపై పెట్రోల్ మా మీద కాదు.. మీ మీద పోస్తాం’’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

Also Read: 15 ఏళ్ల బాలుడిని 20 సార్లు రేప్ చేసి.. కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

అయితే, ఈ ‘పెట్రోల్’ ట్రెండ్ కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ఇంగ్లాండులో కూడా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితులు పోలీసులు. ఎసెక్స్‌లోని బాసిల్డన్‌లో జస్టిన్ జాక్సన్ (28) అనే యువకుడు ఓ బైకును దొంగిలించాడు. ఈ సమాచారం తెలియగానే పోలీసులు అతడిని వెంబడించారు. రోడ్డు మార్గంలో ఓ టీమ్, హెలికాప్టర్‌లో మరో టీమ్ అతడిని పట్టుకొనేందుకు ప్రయత్నించింది.

అయితే, జాక్సన్.. పోలీసుల నుంచి తప్పించుకోడానికి తన వద్ద ఉన్న క్యాన్‌లోని పెట్రోల్‌ను ఎనిమిది మంది పోలీసులపై చల్లాడు. నిప్పు అంటుకుంటే కాలిపోతామని భావించిన పోలీసులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఆ తర్వాత మరో టీమ్‌ అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అతడు నిప్పు పెట్టకపోవడంతో ఆ ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే ఆ పోలీసులపై నీళ్లు కుమ్మరించి సాయం చేశారు.

Also Read: పోలీసులను పరుగులు పెట్టించిన ‘దెయ్యం’.. అసలు విషయం తెలిసి షాక్!

గురువారం ఈ కేసును విచారించిన బాసిల్డన్ క్రౌన్ కోర్టు జాక్సన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదకర ఇంధనాన్ని వాడినందుకు ఈ శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి సమంతా కొహెన్ వెల్లడించారు. ఆ పెట్రోల్ అంటుకుని ఉంటే ఎనిమిది మంది ప్రాణాలు పోయేవని పేర్కొన్నారు. ఈ ఘటనపై జాక్సన్ పోలీసులకు క్షమాపణలు చెబుతూ ఓ లేఖ రాశాడు. ఆ సమయంలో తాను అరెస్టు నుంచి తప్పించుకోడానికి అలా చేయాల్సి వచ్చిందన్నాడు. వారిని చంపే ఉద్దేశం తనకు లేదన్నాడు. ఆ సమయంలో పోలీసులు ఎంతగా భయపడి ఉంటారో అర్థం చేసుకోగలనని తెలిపాడు. అయితే, న్యాయమూర్తి అతడి శిక్ష తగ్గించడం కుదరదని స్పష్టం చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here