పోలీసుల అప్రమత్తం

0
1


పోలీసుల అప్రమత్తం

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. అత్యంత సున్నితమైన అంశం కావడంతో కేంద్ర హోంశాఖ పోలీసులను అప్రమత్తం చేసింది. తీర్పు ఎలా వచ్చినా.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఠాణాల వారీగా అన్ని మతాల పెద్దలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు.

● ప్రధానంగా నిజామాబాద్‌, బోధన్‌లో ప్రత్యేకంగా దృష్టి సారించారు. సున్నితమైన ప్రాంతాల్లో పికెట్లను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో అదనపు బలగాలను మోహరించారు. అన్ని ప్రార్థనా మందిరాల వద్ద సిబ్బందితో నిఘా ఉంచారు. ఏ చిన్న ఘటన జరిగినా సత్వరమే స్పందించేలా ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ● సోషల్‌ మీడియాపైన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తీర్పుపై ప్రచారాలు చేసేవారిని, ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

సోదరభావంతో ఉండాలి

అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఉండాలని సీపీ కార్తికేయ కోరారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో కమిషనరేట్‌ అంతటా గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ఏ ఒక్కరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు. ఎలాంటి సమాచారం ఉన్నా డయల్‌ 100కు చేరవేయాలన్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here