పోలీసు ఠాణాను సందర్శించిన ఎస్పీ

0
2


పోలీసు ఠాణాను సందర్శించిన ఎస్పీ

నాగిరెడ్డిపేట, న్యూస్‌టుడే : నాగిరెడ్డిపేట పోలీస్‌ష్టేషన్‌ను శనివారం జిల్లా ఎస్పీ శ్వేత సందర్శించారు. ఠాణాలో పరిసరాలు, గదులను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. కేసులు పెండింగ్‌లో ఉండకుండా చూసుకోవాలన్నారు. డివిజన్‌లో కేసుల వివరాలను డీఎస్పీ సత్యన్నను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు ఎస్సై మోహన్‌ ఉన్నారు.


డయల్‌ 100కు ఫిర్యాదుల పరంపరా

2818 మంది వినియోగం

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: డయల్‌ 100ను చాలా మంది వినియోగించుకుంటున్నట్టు నిజామాబాద్‌ సీపీ పేర్కొన్నారు. గడిచిన నెలరోజుల్లో 2,818 ఫోన్‌కాల్స్‌ అందినట్లు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 51 ఫిర్యాదులు తప్పుడు సమాచారంగా గుర్తించామన్నారు. మిగిలిన అన్నింటిని పరిష్కరించినట్లు తెలిపారు. కమిషనరేట్‌ ప్రజలు డయల్‌ 100ను మరింత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here