పోలీస్ స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్ భుజంపై కూర్చున్న కోతి, వీడియో వైరల్!

0
1


త్తరప్రదేశ్‌లోని ఓ కోతి పిలిభిత్ పోలీస్ స్టేషన్‌ ఇన్స్‌పెక్టర్ భుజాలపైకి ఎక్కి కూర్చున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్ ద్వివేదీ విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించిన కోతి.. ఒక్కసారిగా ఆయన మీదకు దూకి భుజాలపై కూర్చొంది. ఆ తర్వాత ఆయన తలలో పేలను వెతుకుతూ గడిపేసింది.

Read also: సొంత గుర్రాన్ని కోసుకుని తినేసిన యువతి, టేస్ట్ బాగుందంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్!

కోతి ఆయన భుజాలపై కూర్చున్నా శ్రీకాంత్ మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా కూల్‌గా పనిచేసుకోవడం కనిపించింది. ఆ కోతిని బెదరగొట్టకుండా కిందికి దించేందుకు పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రయత్నించారు. దానికి అరటి పండు చూపించి కిందికి దించే ప్రయత్నం చేశారు. ఐదు నిమిషాల తర్వాత దానికదే లేచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎవరెవరు ఏమంటున్నారో ఈ కింది ట్వీట్లలో చూడండి.

వీడియో:

పేలు కోసం వెతుకుతోందేమో..

ఆయన ఓపికకు హ్యాట్సాప్..

ఈ వీడియో.. ఆయనకు పని మీద ఎంత శ్రద్ధ ఉందో తెలుపుతోంది.

ఆ కోతికి కూడా జీతం ఇవ్వాలి..

Read also: హోటల్‌ కిచెన్‌లో ఏనుగు బీభత్సం.. పిండి తిని పండగ చేస్కుంది!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here