ప్టాస్లిక్‌ మనిషి మనుగడకు ప్రమాదం

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు ప్రతి మనిషి ప్లాస్టక్‌ వినియోగిస్తూ ప్రకతి కలుషితం చేస్తున్నారని కామారెడ్డి సంక్షేమ గురుకులాల సంస్థ జిల్లా కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ జీ.మహేందర్‌ అన్నారు. సష్టిలో ఉచితంగా లభించే ప్రకతిలోని గాలి, నీరును మనిషే కలుషితం చేస్తున్నారని ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఓజోన్‌ పరిరక్షణ గురించి వివరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో సోమవారం ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు 15 ఎకరాల స్కూల్‌, కాలేజ్‌ ఆవరణలో పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో విద్యార్థులచే కాలుష్య కారక విష వాయువులను వాతావరణంలో తగ్గింప జేసేలా ప్రయత్నిస్తానని, జీవకోటిని రక్షిస్తానని, ప్రాణకోటికి ప్రకతి అందించిన రక్షణ కవచమైన ఓజోన్‌ పొరను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, సర్వజీవరాసులకు తలెత్తే ముప్పు నుండి రక్షిస్తానని, ధరిత్రీ రక్షణలో ఒక సైనికుడిలా వారానికి కనీసం 2 గంటలు పనిచేస్తానని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ పదార్థాలను పూర్తిగా నిషేధిస్తానని, పర్యావరణ పరిరక్షణలో పూర్తిగా భాగస్వామినవుతానని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నారు. కార్యక్రమంలో రాజేశ్వర్‌ జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ నవీన్‌, సైన్స్‌ ఉపాద్యాయుడు బిసంతోష్‌, బి.లింగం, పి.ఈ.టి సునంద,సమీనఫిరాదోసి, జె.యల్‌.నరేందర్‌, బి.ఆర్‌.నర్సింగరావు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here