ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు సరైన ఆహారాలు అందించడానికి ఏర్పాటైన చట్టం ప్రకారం పని చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలని తెలంగాణ రాష్ట్ర ఆహారభద్రత కమిషన్‌ చైర్మన్‌ తిర్మల్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో సంబంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో చట్టం అమలుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవలు బాగా అందించడానికి ప్రభుత్వం ఆహార భద్రత చట్టం 2013 ఏర్పాటు చేసిందని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ప్రజలకు ప్రభుత్వం అమలు కార్యక్రమాలు చక్కగా అందించడానికి అధికారులు కషి చేయవలసి ఉంటుందన్నారు. ఇందుకుగాను అధికారులు ముఖ్యంగా ఐసిడిఎస్‌, విద్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పని చేసుకుంటూ వారి పరిధిలోని ప్రజలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం అందించడానికి కషి చేయాలని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్‌ ప్రొఫైల్‌ నిర్వహణ చేయాలని రక్తహీనత లేకుండా అవసరమైన పౌష్టికాహారంతో పాటు ఐరన్‌ టాబ్లెట్స్‌ అందించాలని ఆయన సూచించారు. కమిషన్‌ మొదటిసారిగా జిల్లాకు వచ్చినందున ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ జిల్లాలో ఆహార భద్రత అర్హులందరికీ సరైన రీతిలో అమలయ్యేలా చూడడానికి చర్యలు తీసుకుంటామని ఇది లబ్ధిదారుల హక్కు అని తెలిపారు. క్రింది స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు చట్టం ఆదేశాలకు అనుగుణంగా పని చేయడానికి జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా పాఠశాలల్లో, అంగన్‌వాడి కేంద్రాల్లో మెనూ బోర్డులు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here