ప్రజలకు మరింత చేరువ కావాలి

0
3


ప్రజలకు మరింత చేరువ కావాలి

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావాలని ఎస్పీ శ్వేత సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేరసమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. జిల్లాలో నేరాలు జరుగుతున్న తీరును.. వాటిని నివారించేందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. నేరం చేసిన వారికి శిక్ష పడితేనే బాధితులకు న్యాయం చేసిన వారమవుతామని పేర్కొన్నారు. పోలీసుశాఖపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచేలా అత్యుత్తమ సేవలందించాలని చెప్పారు. సమావేశంలో డీఎస్పీలు లక్ష్మీనారాయణ, సత్తెన్న, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here