ప్రజలకు సుపరిపాలన అందించాలి

0
4



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను అభివద్ధి చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం వర్ని మండలంలోని జాకోరా గ్రామంలో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివద్ధి చేసి ప్రజలకు సుపరిపాలన అందించాలని సంకల్పంతో నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని రూపొందించి సమర్థవంతంగా అమలు చేయుటకు గ్రామస్థాయి అధికారులను ప్రజా ప్రతినిధులను బాధ్యులు చేసిందని అన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినందున సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. గ్రామాలలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా నిధులను ఖర్చు చేయాలని పచ్చదనం పరిశుభ్రంగా స్పష్టంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శిథిలమైన పాడుబడిన, వదిలేసిన బావులను, బోరు బావులను పూడ్చివేయాలని చెప్పారు. కార్యక్రమంలో మండల గ్రామస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here