ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0
1



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోనూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో ప్రజలకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు చెరువులు పొంగిపొర్లుతున్నాయని, అలుగులు పారుతున్నాయని, కొన్నిచోట్ల పెద్ద మొత్తంలో నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు వీటిని చూడడానికి వెళ్ళినప్పుడు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని వారు కూడా ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. రెవెన్యూ నీటిపారుదల తదితర శాఖల అధికారులు గ్రామ కార్యదర్శులు, విఆర్వోలు ఈ విషయంలో అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here