ప్రజల్లోభరోసా పెంపొందించేలా పనిచేయాలి

0
1


ప్రజల్లోభరోసా పెంపొందించేలా పనిచేయాలి

సదాశివనగర్‌‌: పోలీసులు అండగా ఉన్నారన్న భరోసాను ప్రజల్లో పెంపొందించేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్వేత అన్నారు. సదాశివనగర్‌ ఠాణాను శుక్రవారం ఆమె తనిఖీ చేసి దస్త్రాలను పరిశీలించారు. వివిధ కేసుల పురోగతిని ఎస్సై నరేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చోరీలను నివారించడానికి గ్రామీణులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహన చోదకులకు నిబంధనలను తెలియజేయాలని సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్తెన్న, సీఐ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. 

 

https://betagallery.eenadu.net/htmlfiles/125467.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here