ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

0
3


ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి


మొక్కకు నీరు పోస్తున్న కలెక్టర్‌ సత్యనారాయణ

రాజంపేట(భిక్కనూరు), న్యూస్‌టుడే: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఆదివారం ఆయన మాట్లాడారు. కొత్త పంచాయతీరాజ్‌చట్టం ప్రకారం ప్రతీ గ్రామానికి చెత్త సేకరణ కేంద్రం, వైకుంఠధామం, నర్సరీలు, కోతుల ఆహార ప్రాంగణాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. దోమలు రాకుండా ఉండడానికి ప్రతీ ఇంటికి పది కృష్ణ తులసి మొక్కలు, కరివేపాకు, వేప, నాలుగు రకాల పండ్ల మొక్కలను, రైతులకు పొలం వద్ద నాటుకోవడానికి టేకు, చింత, వేప మొక్కలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఐదు వందల జనాభా దాటిన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌, ట్రాలీ ఇస్తామని చెప్పారు. తొలుత గ్రామంలో మొక్కలు నాటి నీరు పోశారు. చెత్తసేకరణ కేంద్రం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల స్వరూప, జడ్పీటీసీ సభ్యుడు కొండ హన్మండ్లు, ఎంపీడీవో విజయ్‌కుమార్‌, సర్పంచి శ్రీజ, ఎంపీటీసీ సభ్యురాలు సుమలత, మండల ప్రత్యేకాధికారి కొండల్‌రావు, గ్రామప్రత్యేకాధికారి విశ్వనాథ్‌, కార్యదర్శి గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతుబజార్‌ ఆకస్మిక తనిఖీ

కామారెడ్డి పట్టణం : జిల్లా కేంద్రంలో వడు రోజులుగా రైతుబజార్‌ తరలింపుపై వివాదం నెలకొన్న దృష్ట్యా జిల్లా పాలనాధికారి సత్యనారాయణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కూరగాయలు విక్రయించే చోట పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మున్సిపల్‌ ఇన్‌ఛార్జి కమిషనర్‌ శైలజ, సిబ్బంది తదితరులున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here