ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

0
3


ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి


చెత్త బుట్టలను పంపిణీ చేస్తున్న జిల్లా పాలనాధికారి సత్యనారాయణ

నస్రుల్లాబాద్‌, న్యూస్‌టుడే: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. నస్రుల్లాబాద్‌ మండలం కాంశేట్‌పల్లిలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికా అమలు తీరును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో చెత్త సేకరణ కేంద్రం, వైకుంఠధామం, నర్సరీలు, కోతుల ఆహార ప్రాంగణాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. దోమలు రాకుండా ప్రతి ఇంటికి పది కృష్ణ తులసి మొక్కలు, కరివేపాకు, వేప, నాలుగు రకాల పండ్ల మొక్కలను అందజేస్తున్నట్లు తెలిపారు. పొలం వద్ద నాటుకోవడానికి టేకు, చింత, వేప మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదు వందల జనాభా దాటిన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్‌, ట్రాలీ ఇస్తామన్నారు. అంతకుముందు గ్రామంలో మొక్కలు నాటారు. చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్‌, ఎంపీపీ విఠల్‌, తహసీల్దార్‌ అర్చన, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం జడ్పీటీసీ సభ్యురాలు జన్నుబాయి, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌, సర్పంచి విజయలక్ష్మి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here