ప్రజల మధ్య ఉండడమే నా ధ్యేయం

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవి లేనప్పుడే ప్రజల మధ్య ఉన్న పదవులు శాశ్వతం కాదు, ప్రజలే శాశ్వతం అని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించి గ్రామ పంచాయతీ ఆవరణలోని చెత్తను శుభ్రపరిచారు. గ్రామంలో మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదటిసారి గ్రామానికి రావడంతో సర్పంచ్‌ కాశం నిరంజని ఆధ్వర్యంలో చైర్మన్‌ విఠల్‌ రావ్‌తో పాటు, ఎంపీపీ రజినీ, జడ్పిటిసి విజయ, ఎంపీడీవో గోపాలకష్ణ లను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవి లేనప్పుడే ప్రజల మధ్య ఉండి సేవలందించాలని, పదవులు ముఖ్యం కాదని, ప్రజల మధ్య ఎల్లకాలం ఉండడమే తన ధ్యేయమని అన్నారు. పల్లెలే పట్టుకొమ్మలు అనే నినాదంతో నేటి గాంధీ కెసిఆర్‌ కార్యరూపం దాల్చిన 30 రోజుల ప్రణాళికల ద్వారా గ్రామాలను సుందరంగా అభివద్ధి చేసుకోవాలన్నారు. రెంజల్‌ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడు మండలాన్ని రెండవ సింగపూర్‌గా చేయడమే లక్ష్యంగా కషి చేస్తామని అన్నారు. కెసీఆర్‌ ఆధ్వర్యంలో మహిళలకు అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యత కల్పించారని, మహిళా రాజ్యం కోసం కషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ అని, 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళలకు సమాన అవకాశాలు కల్పించారని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here