ప్రజావాణిలో 47 ఫిర్యాదులు

0
1



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 47 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూశాఖ-25, మీసేవా-3, డిపివో-4, సిఎంఓ-1, డిఆర్‌డివో-4, బిసి కార్పొరేషన్‌-1, ఎక్సైజ్‌-1, ఆర్టీవో-1, మార్కెట్‌-1, డిఇవో-2, డిపిఆర్‌ఇ-1, విద్యుత్‌-1, డిటిడివో-1, ఆర్‌అండ్‌బి-1 ఫిర్యాదులు అందాయన్నారు. కలెక్టర్‌ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో 18 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. వీటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాకల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి తదితరులున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here