ప్రజాసమస్యలుపరిష్కరించండి

0
0


ప్రజాసమస్యలుపరిష్కరించండి

ఫిర్యాదుదారుల వివరాలు నమోదు చేసుకుంటున్న జేసీ యాదిరెడ్డి

 

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. జిల్లా నలుమూలల నుంచి సోమవారం వచ్చిన ఫిర్యాదుదారులతో జనహిత భవనం కిక్కిరిసింది. జేసీ యాదిరెడ్డి వినతులు స్వీకరించారు. రెండు వారాల నుంచి తక్కువగా ఉన్న ఫిర్యాదుల సంఖ్య ఈ వారం అమాంతంగా ఎక్కువైంది. మొత్తంగా 59 ఫిర్యాదులు అందాయి. అందులో 33 ఫిర్యాదులు రెవెన్యూశాఖకు సంబంధించినవే కావడం విశేషం.. సమస్యలు పరిష్కరించాలని జేసీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

వినూత్న నిరసన

పిట్లం మండలం సిద్దాపూర్‌కు చెందిన మెట్టు బాలయ్య కలెక్టరేట్‌లో వినూత్నంగా నిరసన తెలిపారు. అధికార్లకు సమర్పించిన దరఖాస్తు పత్రాలు, ఫొటోలను మెడలో వేసుకొని జనహిత భవన్‌కు వచ్చారు. తాతల కాలం నుంచి భూమిని సాగు చేసుకుంటుంటే అసలు కాస్తులో లేరంటూ రెవెన్యూ అధికారులు నివేదిక ఇస్తున్నారని వాపోయారు. 283 సర్వే నంబర్‌లో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని, పాస్‌ పుస్తకంలో దాని పక్కనే ఉన్న 287 సర్వే నంబరు అని తప్పుగా పడిందన్నారు. దీంతో అధికారులు 287 సర్వే నంబరు కాస్తులో లేరంటూ నివేదిక ఇస్తున్నారని ఆవేదన చెందారు.

కొత్త పాసు పుస్తకం రాలేదు – తిగుళ్ల పోచయ్య, కన్నాపూర్‌ (లింగంపేట)

నాకు 2 ఎకరాల సాగు భూమి ఉంది. పాత పాస్‌ పుస్తకం ఉంది. కొత్త పాస్‌ పుస్తకం అందజేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఒక్కరు పట్టించుకోవడం లేదు. తహసీల్దార్‌ కార్యాలయానికి ఐదారుసార్లు వెళ్లాను. సమస్య పరిష్కరించడం లేదు. రైతు బంధు డబ్బులు కూడా రాకపోవడంతో జేసీ సారుకు ఫిర్యాదు చేశాను.

సాగు భూమి కేటాయించాలి – సాయిలు, పర్మళ్ల (లింగంపేట)

నేను వ్యవసాయ కూలీని.. గుంటెడు సాగు భూమి కూడా లేదు. ప్రభుత్వం తరపున రెండు ఎకరాల సాగు భూమి కేటాయిస్తే నేనే సాగు చేసుకుంటాను. ఇది వరకు కూడా ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకున్నాను. భూమి రాలేదు.. దయచేసి భూమి ఇప్పించండి

ఓ నాయకురాలు బెదిరిస్తుంది – బాధితులు, దోమకొండ

దోమకొండ మండల కేంద్రంలో మాకందరికి 1.14 ఎకరాల భూమి ఉంది. మా భూమిని వాటాలు పంచుకున్నాం.. దాని చుట్టుపక్కల భవనాలు వెలిశాయి. నాలా మార్పిడి కూడా చేయించాం.. మా తాతల సమాధులు భూమిలో ఉంటే కూల్చేశాం.. పక్కనే ఓ నాయకురాలు బంధువుల భూమి ఉంది. దీంతో ఆమె మమ్మల్ని బెదిరిస్తుంది. 500 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. పోలీసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.

ప్రమాదంలో కాలు పోయింది.. పింఛన్‌ ఇప్పించండి– సాయిరాం, రామలక్ష్మణులపలి

ప్రమాదంలో ఒక కాలు పోయింది. 9 నెలల క్రితం రైలు ప్రయాణం చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాను.. అప్పటి నుంచి చదువు మానేశాను. జీవనం క్లిష్టంగా ఉంది. వికలాంగుల పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకొన్నాను రాలేదు.. కృత్రిమ కాలు పెట్టించాలని కలెక్టర్‌ సార్‌ను వేడుకొన్నాను.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here