ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

0
1


ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కోటగిరిలో చెక్కులను అందజేస్తున్న సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

 

కోటగిరి, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కోటగిరి మండలంలో గురువారం పలు సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ని, రుద్రూర్‌, కోటగిరి మండలాల్లోని 119 మంది లబ్ధిదారులకు రూ.50 వేల చొప్పున బీసీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన రుణాలను, సుద్దులం శివారులోని 60 మందికి భూమి పట్టాలను, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద ప్రజల అభ్యున్నతికి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారన్నారు. అడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది పంఛన్ల పంపిణీకి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రైతులు సాగు చేసుకునే పంటలకు పెట్టుబడుల నిమిత్తం రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు రూ.15 వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు బీమాను సైతం అమలు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం నీటితో రెండు పంటలకు సరిపడా సాగునీరు అందిస్తామని చెప్పారు. మంజీరా నదిలో చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.140 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అనంతరం కొడిచర్ల మంజీర నదిని సందర్శించి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. పనులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొన్నారు. పనులు పూర్తయ్యాయని, నీరుంటే ప్రారంభించవచ్చని అధికారులు సభాపతికి తెలిపారు. మంజీరలో నీరు లేకపోవడంతో తన పల్లెనిద్రను రద్దు చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బోధన్‌ ఆర్డీవో గోపీరాం, ఎంపీపీ సునీత, జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌పటేల్‌, గంగాధర్‌, ఎజాజ్‌ఖాన్‌, ఎంపీడీవో అత్తారుద్దీన్‌, ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ విఠల్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here