ప్రణాళికతో పల్లెల్లో శోభ

0
3


ప్రణాళికతో పల్లెల్లో శోభ

నందిపేట్‌లో పరిసరాలు శుభ్రం చేస్తున్న జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు

నందిపేట్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం తీసుకొచ్చిన 30 రోజుల ప్రణాళికతో పల్లెల్లో కొత్త శోభ సంతరించుకుందని జడ్పీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. నందిపేట్‌లో గురువారం ఆయన వివిధ కాలనీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. గౌడ సంఘం భూమిలో, ఇతర కాలనీల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాలను బాగు చేసుకుంటున్నారని ప్రశంసించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచి సంబారు వాణి, ఎంపీపీ సంతోష్‌, జడ్పీటీసీ సభ్యురాలు ఎర్రం యమున, సయ్యద్‌, ఉల్లి శ్రీనివాస్‌గౌడ్‌, చందర్‌, మదారుద్దీన్‌ పలువురు నాయకులు పాల్గొన్నారు.

నందిపేట్‌: మండలంలో 30 రోజుల ప్రణాళిక కొనసాగుతోంది. ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం రోడ్లకు ఇరువైపుల, నివాస గృహాల సమీపంలో పిచ్చి మొక్కలను తొలగించారు. చెత్తా చెదారాన్ని డంపింగ్‌యార్డ్‌లకు తరలించారు.

మొక్క నాటుతున్న తల్వెద సర్పంచి చందన

తల్వేద(వెల్మల్‌): నందిపేట్‌ మండలం తల్వేద గ్రామానికి చెందిన కుంట సుదర్శన్‌రెడ్డి 240 మొక్కల సంరక్షణ ట్రీగార్డులను అందజేశారు. సర్పంచి చందన ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లింగన్న, ఉప సర్పంచి పీఎన్‌ సాయారెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సుర్భిర్యాల్‌ (ఆర్మూర్‌ గ్రామీణం): ముప్పై రోజుల ప్రణాళికతో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీపీ పస్క నర్సయ్య పేర్కొన్నారు. గురువారం సుర్భిర్యాల్‌లో మొక్కలు నాటారు. వాటికి రక్షణ కంచెలు ఏర్పాటు చేశారు. గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేసి ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు తొలగించారు. కార్యక్రమంలో సర్పంచి సవిత, ఎంపీడీవో గోపిబాబు, ప్రత్యేకాధికారి నరేష్‌, కార్యదర్శి రవికుమార్‌, క్షేత్రసహాయకుడు సాయిలు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here