ప్రణాళికా పనుల పరిశీలన

0
2


ప్రణాళికా పనుల పరిశీలన

దోసుపల్లిలో పర్యటిస్తున్న జిల్లా పాలనాధికారి సత్యనారాయణ

జుక్కల్‌, న్యూస్‌టుడే: దోసుపల్లిలో చేపడుతున్న 30 రోజుల ప్రణాళికా పనులను జిల్లా పాలనాధికారి సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. కాలనీలో తిరుగుతూ పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి పంచాయతీ విద్యుత్తు బిల్లులను చెల్లించాలన్నారు. పవర్‌వీక్‌లో భాగంగా విద్యుత్తు శాఖ అధికారులు గ్రామాల్లోకి వచ్చి పనులు చేస్తున్నారన్నారు. వీధి దీపాల ఏర్పాటుకు మూడో తీగను అమర్చుతున్నారని తెలిపారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరును అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో చంద్రమోహన్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, ఎంపీపీ యశోద, జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీబాయి, సర్పంచి దేవ్‌కత్తె సునీత, ఎంపీడీవో యుగేందర్‌రెడ్డి, నాయకులు దాదారావు పాటిల్‌, నీలుపాటిల్‌, తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here