ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్‌ లింగన్న

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిఘటన పోరాట యోధుడు సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ లింగన్న సంతాప సభను హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2019 ఆగస్టు 13న జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.సూర్య శివాజీ ప్రజలను కోరారు. మామిడిపల్లిలో లింగన్న సంతాప సభ పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడారు. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రజాస్వామిక హక్కుల రక్షణకు కావలి కుక్కల ఉంటానని, ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ నా లక్ష్యం అని ఒట్టు పెట్టుకుని, నేడు కేసీఆర్‌ చేస్తున్నదేమిటని శివాజీ ప్రశ్నించారు? హరితహారం పేరుతో గిరిజన భూములను కేసీఆర్‌ ప్రభుత్వం కబ్జా చేయకుండా, పోడు భూముల రక్షణకై లింగన్న సైనికుడిగా పనిచేశాడని ఆయన అన్నారు. లింగన్నను కాల్చిచంపిన పోలీసులను గిరిజన ప్రజలు తరిమి కొట్టిన దశ్యాలు ప్రజలకు, ఉద్యమకారులకు స్ఫూర్తి నింపిందని ఆయన అన్నారు. లింగన్న చిరు ప్రాయం నుండి న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేస్తూ రాష్ట్ర నాయకుడిగా ఎదిగి, గిరిజన పల్లెల్లో పొడిచే పొద్దుపొడుపు అయ్యాడని ఆయన అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here