ప్రతిభను వెలికి తీసేందుకు కృషి

0
0


ప్రతిభను వెలికి తీసేందుకు కృషి

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎన్‌ఏఈఎస్టీ (నేషనల్‌ అన్వేశిక్‌ ఎక్స్‌పర్మెంటల్‌ స్కిల్‌ టెస్ట్‌) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో 480 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారని వెల్లడించారు. విద్యార్థుల సృజనాత్మకతను పరీక్షించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి సిద్ధిరాంరెడ్డి, సంస్థ జిల్లా కన్వీనర్‌ ప్రవీణ్‌, ప్రతినిధులు ప్రతాప్‌రెడ్డి, వేణు, సంతోష్‌, ప్రవీణ్‌, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here