‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్: మరోసారి ఆకట్టుకున్న తమన్

0
3


‘చిత్రలహరి’ చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ అంటూ తెలుగు ప్రేక్షకులకు పండగలాంటి సినిమాను అందించేందుకు సిద్ధమవుతున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశీ ఖన్నా హీరోయిన్‌గా ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అమెరికాలో జరిగింది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ సినిమాలో మంచి సందర్భంలో ఈ పాట వస్తుంది. అలాంటి టైటిల్‌ సాంగ్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తమన్ స్వరపరిచిన ఈ పాటకు కేకే సాహిత్యం అందించారు. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ మధ్య కాలంలో తమన్ మంచి స్వరాలను అందిస్తున్నారు. మొన్నీమధ్యే ‘అల.. వైకుంఠపురములో…’ రెండు అద్భుతమైన పాటలను స్వరపరిచిన తమన్.. ఇప్పుడు తేజూ కోసం మరో ఆసమ్ ట్యూన్‌ను ఇచ్చారు.

కాగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు.. ప్రతి ఒక్కరు హాయిగా ఎంజాయ్ చేసే మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. సాయి తేజ్‌ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్‌లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్‌గా చూపించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్‌టైన్మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

Also Read: వయొలెన్స్ కావాలన్నారుగా.. సాలిడ్‌గా ఇస్తా: నాని

క‌ట్టప్పగా తెలుగు ప్రేక్షకుల‌కి మరింత చేరువైన ప్రముఖ న‌టుడు స‌త్యరాజ్ క్యారెక్టర్‌ని ఈ సినిమాలో ద‌ర్శకుడు మారుతి ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. అలాగే, ఈ సినిమాలో న‌టిస్తున్న మ‌రో న‌టుడు రావు ర‌మేశ్ పాత్ర కూడా హైలెట్‌గా ఉండ‌నుందట. ఇంకా ఈ సినిమాలో విజయ కుమార్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ ఇతర పాత్రలు పోషించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here