ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవరచుకోవాలి

0
3


ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవరచుకోవాలి


రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి ప్రతినిధులను సన్మానిస్తున్న

ఆర్యవైశ్య సంఘం, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు

కామారెడ్డిఅర్బన్‌, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవరచుకోవాలని రోటరీ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ ఎలెక్ట్‌ ఎన్‌వీ హన్మంత్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అయ్యప్ప వేడుకల మందిరంలో ఆదివారం నిర్వహించిన రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి 45వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మధ్యనే ఉండాలని నూతన కార్యవర్గానికి సూచించారు. నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా కంచర్ల లింగం, కార్యదర్శిగా కమ్మరి భాస్కర్‌, కోశాధికారిగా సోమిషెట్టి సంతోష్‌కుమార్‌ల చేత అసిస్టెంట్‌ గవర్నర్‌ కొడాలి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పున్న రాజేష్‌, కార్యదర్శి శిరీష్‌, అసిస్టెంట్‌ గవర్నర్‌ బాల్‌కిషన్‌, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు జైపాల్‌రెడ్డి, శ్రీశైలం, కృష్ణమూర్తి, శంకర్‌, పబ్బ జగన్నాథం, కాశీనాథం, చీల ప్రభాకర్‌, పిప్పిరి వెంకటి, శ్రీనివాస్‌, ముప్పారపు ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/133616.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here