ప్రతి గింజను ఖరీదు చేస్తాం

0
1


ప్రతి గింజను ఖరీదు చేస్తాం


రంగుమారిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న డీసీవో సింహాచలం

దూపల్లి, కందకుర్తి(రెంజల్‌), న్యూస్‌టుడే: తడిసిన, రంగుమారిన ప్రతి గింజను ఖరీదు చేస్తామని డీసీవో సింహాచలం పేర్కొన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారడంతో ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు శుక్రవారం ఆయన రెంజల్‌ మండలంలోని దూపల్లి, కల్యాపూర్‌, దండిగుట్ట శివారు ప్రాంతాల్లో పంటలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా ఖరీదు చేసేందుకు మిల్లర్లతో మాట్లాడతామన్నారు. మహారాష్ట్ర నుంచి ధాన్యం రాకుండా కందకుర్తి వద్ద, మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో పోలీస్‌, రెవెన్యూ అధికారుల సహకారంతో తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుపేర్కొన్నారు. 24 గంటల పాటు తనిఖీలు నిర్వహించి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. పక్క రాష్ట్రాల్లో గిట్టుబాటు ధర వస్తే స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సీజన్‌లో 7.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఖరీదు చేసేందుకు ఖరీఫ్‌ ప్రణాళిక రూపొందించామన్నారు. అనంతరం మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు లతీఫ్‌తో కలిసి కందకుర్తి సరిహద్దు వద్ద తనిఖీ కేంద్రం పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయాధికారి లక్ష్మీకాంతరెడ్డి, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, భూమారెడ్డి, ధనుంజయ, గోపాల్‌రెడ్డి, సాయిలు తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here