ప్రత్యేకతల విజయదశమి

0
3


ప్రత్యేకతల విజయదశమి

-న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం


పాతబోధన్‌లోని రేణుకా ఎల్లమ్మ

దేశమంతా సంబరాలు నిర్వహించుకొనే విజయ దశమి రోజు రానే వచ్చింది. తెలంగాణాలో అయితే ఏకంగా దసరా, బతుకమ్మ నేపథ్యంలో పక్షం రోజులు పండుగ రోజులే. ఈ నేపథ్యంలో అందరికీ విజయ దశమి వేడుకలు వైభవంగా నిర్వహించుకోవడానికి ఆస్కారమేర్పడుతోంది. అయితే ఈ పండుగను ప్రాంతానికో రకంగా జరుపుకోవడం ఆనవాయితీ. ప్రధానంగా ఆయుధ, జంబి చెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం అన్ని చోట్లా ఉన్నా... మరికొన్ని చోట్ల మాత్రం అదనంగా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో బోధన్‌ నియోజకవర్గంలోని ముఖ్యమైన విశేషాలు..

మూడు చోట్ల మూడు భిన్నమైనవి....

బోధన్‌ పట్టణం భౌగోళికంగా మూడు ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందింది. వాటికి తగ్గట్టుగానే మూడు ప్రాంతాల్లో విభిన్నమైన రీతుల్లో వేడుకలు జరుగుతాయి. శక్కర్‌నగర్‌లో వీహెచ్‌పీ నేతృత్వంలో దసరా ఉత్సవ కమిటీ రామ్‌లీలా మైదానంలో రావణ దహనం చేపడుతుంది. అంతకుముందు జంబి చెట్టు వద్ద ఆయుధ పూజ చేసి సభ నిర్వహిస్తారు. అనంతరం రావణుడి దహనం ఉంటుంది. రాకాసిపేట్‌లో భీముడు బకాసరుడిని సంహరించినట్లు చెప్పే గుట్టపై వెలసిన భీమేశ్వరాలయంలో అమ్మవారి విగ్రహాన్ని భక్తులు సందర్శిస్తారు. అక్కడి నుంచి జంబి తీసుకెళతారు. ఆర్య సమాజ్‌ ఆధ్వర్యంలో హోమం, ఆయుధ పూజ చేపడతారు. ఇక పాతబోధన్‌లో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాటు చేస్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.


రాకాసిపేట్‌లో బకాసురుడిని సంహరించే సన్నివేశం

ఏఆర్పీలో క్యాంపులో..

ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపులో సైతం ఏటా రావణ దహనం చేపడతారు. మండలం మొత్తం ఒకే విధంగా పండగను ఆచరించినా ఈ గ్రామంలోనే అంతా ఒక చోటకు చేరి రావణుడి దహనం చేపట్టి చెడుపై విజయం సాధించినట్లు సంబరాలు నిర్వహిస్తారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here