ప్రత్యేక ఆరోగ్య శిబిరాల ఏర్పాటు

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణ పరిధిలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బాన్సువాడ పట్టణంలో రెండుచోట్ల, కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట ఉర్దు భవన్‌లో శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నామన్నారు. వైద్యులు సుజాయత్‌ అలీ, శిరీష్‌కుమార్‌ ల ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది జ్వరంతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం 650 మందికి చికిత్స చేసి 25 మందిని రక్తపరీక్షల నిమిత్తం పంపామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య బోధకులు సంజీవరెడ్డి, గౌస్‌, అక్తర్‌ అలీ, రమణ, వినోద, సంధ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here