ప్రపంచం ఒక డిజిటలైజేషన్‌గా మారింది

0
4నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాప్రతినిధులు చట్టసభలలో మరింత మెరుగైన పనితీరు కనబరచడానికి ఆధునిక శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరుగుతున్న 64వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌ లో జరిగిన నేటి రోజులలో చట్టసభల నిర్వాహణలో శాస్త్ర మరియు సాంకేతిక అంశాల ప్రభావం అంశంపై ప్రతినిధులను ఉద్దేశించి స్పీకర్‌ పోచారం మాట్లాడారు. మారిన పరిస్థితులలో శాస్త్ర, సాంకేతికత ఆధునిక పరిజ్ఞానంతో ప్రపంచం ఒక డిజిటలైజేషన్‌గా మారిందన్నారు. నేడు సామాన్య ప్రజలు అన్ని రంగాలతో పాటుగా చట్టసభలలో కూడా ఖచ్చితత్వం, సమర్ధత, నైపుణ్యం, పారదర్శకత కోరుకుంటున్నారని, మారుతున్న కాలానుగుణంగా నేటి ఆధునిక యుగంలో పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభలు కూడా ఆధునిక శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయన్నారు. చట్టసభల ప్రతినిధులు ఆధునిక పరిజ్ఞానం సహాయంతో తమ తోటి సభ్యులతో మెరుగైన సంభాషణలు ఏర్పర్చుకోవడంతో పాటు, తమ నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో సమాచార పరిదిని పంచుకుంటున్నారని పోచారం తెలిపారు. సామాన్య ప్రజలు తమ వినతులను గౌరవ చట్టసభల ప్రతినిధులకు చేరవేయడానికి ఇ-మేయిల్‌ సాంకేతికంగా ఉపయోగపడుతుందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here