ప్రపంచకప్‌లో 19 అంపైరింగ్‌ తప్పిదాలు.. డీఆర్‌ఎస్‌ లేకుంటే అంతే సంగతులు!!

0
0


ఈ ప్రపంచకప్‌లో 19 అంపైరింగ్‌ తప్పిదాలు జరిగాయి. క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌ (అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్ధతి) ఉంది కాబట్టి కొందరు బ్యాట్స్‌మన్‌ బతికిపోగా.. మరొకొందరు నిరాశగా పెవిలియన్ చేరారు. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ అంపైర్‌ తప్పిదంకు బలైపోయాడు. శ్రీలంక అంపైర్‌ కుమార ధర్మసేన ఇచ్చిన తప్పుడు నిర్ణయం కారణంగా రాయ్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో ఇంగ్లండ్‌కు రివ్యూ లేకపోవడంతో రాయ్‌ నిరసన వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ప్రపంచకప్‌లో చాలానే జరిగాయి.

ప్రపంచకప్‌లో ఫీల్డ్‌ అంపైర్లు ప్రకటించిన నిర్ణయాలు డీఆర్‌ఎస్‌లో తప్పుగా తేలిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అత్యధికంగా తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన జాబితాలో రిచర్డ్‌ అలన్‌ కెటల్‌బారో (ఇంగ్లండ్‌ అంపైర్‌) మొదటి స్థానంలో ఉన్నాడు. అలన్‌ ప్రకటించిన ఐదు నిర్ణయాలు డీఆర్‌ఎస్‌లో తప్పుగా తేలాయి. ఆ తర్వాత క్రిస్టోఫర్‌ గాఫనీ (న్యూజిలాండ్‌), పాల్‌ విల్సన్‌(ఆస్ట్రేలియా), రుచిర పలియాగురుజే ( శ్రీలంక), కుమార ధర్మసేన (శ్రీలంక)లు తలో నాలుగు అంపైరింగ్‌ తప్పిదాలు చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.

అయితే డీఆర్‌ఎస్‌తో క్రికెటర్లు అంపైర్ల నిర్ణయాలకు బలయ్యే సందర్భాలు తగ్గాయి. డీఆర్‌ఎస్‌లో హాక్‌ ఐ, హాట్‌ స్పాట్‌, స్నికో మీటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి సాయంతో బ్యాట్స్‌మన్‌ ఔటా, కాదా అనేది థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫీల్డ్‌ అంపైర్‌కు సూచిస్తాడు. ఆ క్రమంలోనే ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని సరి చేసుకుని తుది ఫలితం ప్రకటిస్తాడు. ఇది బ్యాట్స్‌మన్‌కు మేలు చేసే అంశమే. ఒక్కోసారి రివ్యూ లేకపోతే అంపైర్‌ తప్పుడు నిర్ణయం ఇస్తే అప్పుడు మాత్రం బ్యాట్స్‌మన్‌ బలవ్వాల్సిందే.

వన్డే ఫార్మాట్‌లో ఒక జట్టుకు ఒక రివ్యూ ఉంటుంది. జట్టు తమ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన క్రమంలో రివ్యూ అమల్లోకి వస్తుంది. అంపైర్‌ నిర్ణయం తప్పు అని బ్యాట్స్‌మన్‌ భావిస్తే రివ్యూ తీసుకుంటాడు. ఒకసారి రివ్యూ కోల్పోతే మళ్లీ ఆ జట్టుకు ఇంకో రివ్యూ చాన్స్‌ ఉండదు. బ్యాట్స్‌మన్‌ తీసుకున్న రివ్యూ సక్సెస్‌ అయితే మాత్రం అది అలానే ఉంటుంది. ఇక థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేసిన క్రమంలో కూడా రివ్యూకు వెళ్లిన జట్టు దాన్ని నిలబెట్టుకుంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here