ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ టై.. చాపెల్ కొత్త ప్రతిపాదన ఏంటో తెలుసా!!

0
2


జూన్ 14న ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్, సూపర్‌ ఓవర్‌ టైగా మారడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది మాజీ ఆటగాళ్లు మరో సూపర్ ఓవర్ పెడితే ఫలితం వచ్చేది అని అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్ భిన్న అభిప్రాయాన్ని తెలిపాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

మెరుగైన స్థానంలో ఉన్న జట్టే విజేత:

మెరుగైన స్థానంలో ఉన్న జట్టే విజేత:

‘ఫైనల్ మ్యాచ్ టై అయినపుడు లీగ్‌ దశలో ఇరు జట్లు పట్టికలో ఉన్న స్థానాలని పరిగణలోనికి తీసుకోవాలి. లీగ్ విజయాలతో పాయింట్లు లేదా నెట్‌ రన్‌రేటుతో ఏదో ఒక జట్టు ఉత్తమ స్థానంలో ఉంటుంది. మెరుగైన స్థానంలో ఉన్న జట్టుని విజేతగా ప్రకటించాలి. సూపర్‌ ఓవర్‌లో ఫలితం తేలకుంటే.. విజేతను నిర్ణయించడానికి ఇదే సరైంది’ అని చాపెల్ పేర్కొన్నాడు.

ఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి:

ఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి:

‘డీఆర్‌ఎస్ ఆటగాళ్ల చేతుల్లో కాకుండా అంపైర్ల ఆధీనంలో ఉండాలి. సరైన తీర్పుని ఇవ్వాలని ఐసీసీ భావిస్తే.. కవరేజ్‌ చేసే టెలివిజన్ సంస్థ కంటే సాంకేతిక బాధ్యత మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. బ్యాట్‌, బంతికి సమతుల్యతని పెంచడానికి బ్యాట్‌ వెడల్పు, బౌండరీల దూరంలో ఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి’ అని చాపెల్ సూచించాడు. 1964 నుంచి 1980 వరకు 75 టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించి 5345 పరుగులు చేసాడు.

క్యాన్సర్‌ను జయించి:

క్యాన్సర్‌ను జయించి:

చాపెల్ చర్మ క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించాడు. రేడియేషన్‌ థెరపీతో ఆ వ్యాధి తగ్గిందని స్వయంగా చాపెల్ తెలిపాడు. ఆగస్టు ఒకటిన ప్రారంభమయ్యే యాషెస్‌ సిరీస్‌లో కామెంట్రీకి తాను సిద్ధమని చెప్పాడు. ‘ఈ వయస్సులో క్యాన్సర్‌ సోకితే ఇక జీవితం అయిపోయిందనే అనుకుంటాం. నేనూ చర్మ క్యాన్సర్‌తో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నా. రేడియేషన్‌ థెరపీతో తగ్గింది. కాన్సర్ తీవ్ర రూపం దాల్చనందుకు సంతోషంగా ఉంది’ అని చాపెల్‌ పేర్కొన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here