ప్రపంచకప్‌.. రోహిత్‌ శర్మకు గోల్డెన్‌ బ్యాట్‌

0
1


ప్రపంచకప్‌-2019లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ గోల్డెన్‌ బ్యాట్‌ను గెలుచుకున్నాడు. మెగా టోర్నీలో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్‌ శర్మ గోల్డెన్‌ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. దీంతో గోల్డెన్‌ బ్యాట్‌ను అందుకున్న భారత మూడో ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించాడు.

సచిన్‌, ద్రావిడ్‌ తర్వాత:

సచిన్‌, ద్రావిడ్‌ తర్వాత:

రోహిత్‌ శర్మ కంటే ముందు భారత దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్ (1996, 2003), రాహుల్‌ ద్రావిడ్‌ (1999) గోల్డెన్‌ బ్యాట్‌ను సాధించారు. ఈ ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లలో ఐదు శతకాలు సాధించిన రోహిత్‌ శర్మ 81 సగటుతో 648 పరుగులు సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ (647) రెండో స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్ షకిబ్‌ అల్‌ హసన్‌ (606) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

 సెంచరీ చేస్తే:

సెంచరీ చేస్తే:

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ జో రూట్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే రోహిత్‌ను అధిగమించే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఫైనల్లో 30 పరుగులకే ఔటవ్వడంతో విలియమ్సన్‌ 576 పరుగులతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక జో రూట్‌ 7 పరుగులు చేయడంతో 556 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. బెయిర్‌స్టో (532) ఆరో స్థానంలో ఉన్నాడు.

అత్యధిక సెంచరీలు:

అత్యధిక సెంచరీలు:

ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగానూ రోహిత్‌ రికార్డు సృష్టించాడు. ఇదివరకు ఒకే ప్రపంచకప్‌లో నాలుగు సెంచరీలతో ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ప్రపంచకప్‌లలో ఆరు సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా సచిన్ సరసన చేరాడు.

ఐసీసీపై విమ‌ర్శ‌లు:

ఐసీసీపై విమ‌ర్శ‌లు:

ఐసీసీ నిబంధ‌న‌ల వ‌ల్లే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు ఓడిపోయిందంటూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మౌతున్న విష‌యం తెలిసిందే. ల‌క్ష‌లాదిమంది క్రికెట్ అభిమానులు.. ఐసీసీ నిబంధ‌న‌ల‌ను త‌ప్పుప‌డుతూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. వాట‌న్నింటికీ కేన్ విలియ‌మ్స‌న్ పేరును ట్యాగ్ చేయ‌డం వ‌ల్ల ఆయ‌న పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. అంద‌రు అభిమానుల త‌ర‌హాలోనే రోహిత్ శ‌ర్మ కూడా ఐసీసీ నిబంధ‌న‌ల‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. వాటిని పునఃస‌మీక్షించాల్సిన అవ‌సరం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఫ‌లితం, ఐసీసీ నిబంధ‌న‌ల‌పై ఓ భార‌తీయ క్రికెట‌ర్ నోరు విప్ప‌డం ఇదే తొలిసారి.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ:

కెప్టెన్‌గా రోహిత్ శర్మ:

ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో ఆధిపత్యం ప్రదర్శించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో పేలవమైన ఆటతీరు కనబరిచింది. ఈ ఓటమి విరాట్ కోహ్లీపై కెప్టెన్సీపై కూడా ప్రభావం చూపింది. మరోవైపు బీసీసీఐ సైతం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ… వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించాలని చూస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here