ప్రపంచ క్రికెట్‌లో కొత్త చరిత్రకు నాంది: తొలి వన్డేకి ఆతిథ్యమిస్తోన్న అమెరికా

0
2


హైదరాబాద్: సెప్టెంబర్‌లో యునైటెడ్ స్టేడ్స్ తొలిసారి ఓ వన్డే మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వబోతోంది. క్రికెట్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ గేమ్ 1844లో యునైటెడ్ స్టేట్స్-బ్రిటిష్ ప్రోవిన్స్ జట్ల మధ్య జరిగింది. న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్‌ జరిగి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది.

దక్షిణాఫ్రికా vs భారత్: కుల్దీప్‌, చహల్‌లను ఎందుకు ఎంపిక చేయలేదంటే?

ఈ నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ సెప్టెంబర్ 13న పపువా న్యూ గునియాతో తొలి వన్డే మ్యాచ్‌లో తలపడనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2లో భాగంగా రెండో ముక్కోణపు సిరిస్‌లో అమెరికా క్రికెట్ జట్టు పపువా న్యూ గునియా జట్టుతో తలపడనుంది. ఈ సిరిస్‌లో నమీబియా మూడో జట్టుగా ఆడుతోంది.

అమెరికా గడ్డపై క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు గాను ఇప్పటికే టీమిండియా, వెస్టిండిస్ లాంటి జట్లు పలు టీ20 మ్యాచ్‌లను ఆడాయి. ఆగస్టులో లాడౌర్హిల్, ఫ్లోరిడా వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండు టీ20ల్లో టీమిండియానే విజయం సాధించిన సంగతి తెలిసిందే.

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్: రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!

ఐసీసీ వరల్డ్‌కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా నమీబియా, పపువా న్యూ గునియా, అమెరికా జట్ల మధ్య మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషుల వరల్డ్‌కప్ లీగ్ 2 కాంపిటేషన్‌లో భాగంగా తొలిసారి అమెరికా, నమీబియా జట్లు పాల్గొంటున్నాయి. పపువా న్యూ గునియాకు ఇది రెండో సిరిస్.

ఫోర్ట్ లాహిర్డాలే వేదికగా సెప్టెంబర్ 13 నుంచి 23 వరకు మొత్తం 11 రోజుల్లో నాలుగు వన్డేలు జరగనున్నాయి. 2023లో భారత్ ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనాలంటే ఈ సిరిస్ ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్‌కప్ లీగ్ 2లో టాప్-3లో నిలిచిన జట్లు 2022లో జరిగే క్వాలిఫియర్ టోర్నీలో ఆడతాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here