ప్రభుత్వానికి ఆర్బీఐ నిధుల బదిలీ సమర్ధించనని ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు

0
0


ప్రభుత్వానికి ఆర్బీఐ నిధుల బదిలీ సమర్ధించనని ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు

ఆర్‌బీఐ నిధుల బదిలీని తాను సమర్థించనని ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నుండి నిధుల బదిలీ ప్రభుత్వం చాలా గట్టిగా కోరుకుంటుందని కానీ అది సమంజసమైన పని కాదని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో ప్రభుత్వం చాలా నిరాశగా ఉన్నట్లు అర్థమవుతోందని అభిప్రాయపడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు ఆర్బీఐ నుండి నిధులను బదిలీ చేసినప్పటికీ స్వల్ప ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ అని, అంతే స్వతంత్రంగా వ్యవహరించాలని చెప్పిన ఆయన అదనపు నిల్వల విలువను నిర్ణయించడంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు . శుక్రవారం సీఎఫ్‌ఏ సొసైటీ ఇండియా సమావేశంలో పేర్కొన్న ఆయన విదేశీ కరెన్సీలో సార్వభౌమ బాండ్లను జారీ చేయడం ఏదో ఒక సారి జరిగితే ఫర్వాలేదు కానీ దానిని క్రమం తప్పకుండా ఉపయోగించడం మంచిది కాదని హితవు పలికారు.

ఆర్బిఐ పై ఆధిపత్యం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పెత్తనాన్ని ఆయన తప్పు పట్టారు. అదనపు నిధులను కోరుతూ ప్రభుత్వం చేస్తున్న వివిధ ప్రయత్నాలపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.

ఇతర దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థతో, మన ఆర్థిక వ్యవస్థకు చాలా భిన్నమైన పరిస్థితి ఉందని, ఇతర దేశాలతో పోలిస్తే మన ఆర్‌బీఐకున్న నష్టభయాలు వైవిధ్యమైనవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఇక ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి ఎంత మేర నిధులను బదిలీ చేయాలన్నదానిపై ఏర్పాటు చేసిన బిమల్‌ జలాన్‌ కమిటీ తన నివేదికకు తుది రూపు దిద్దుతున్న ఈ సమయంలో సుబ్బారావు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి చేసే నిధుల బదిలీ వల్ల ప్రయోజనం స్వల్పమేనని, కానీ ప్రభుత్వ తీరు ఆర్బీఐ ని ఇబ్బంది పెడుతోందని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పెట్టుబడుదార్లు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే అటు ప్రభుత్వం.. ఇటు ఆర్‌బీఐకున్న బ్యాలెన్ష్‌షీట్లను పరిశీలిస్తాయని గుర్తు చేశారు. అదే సమయంలో ఆర్‌బీఐకు స్వయంప్రతిపత్తి ఉందని, తనని కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు స్పష్టంగా చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here