ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రతినిధులతో 'బంగారం బోర్డు'

0
2


ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రతినిధులతో ‘బంగారం బోర్డు’

న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల కొనుగోళ్లు, అమ్మకాల పర్యవేక్షణకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేకంగా గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ప్రయివేటు ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు ఇందులో ఉంటారు. ఆభరణాలను ఆస్తిగా మలుచుకునే విధంగా ప్రతి సంవత్సరం ఆకర్షణీయమైన పథకాలు ప్రకటించడంపై ఇది దృష్టి సారిస్తుంది. బంగారాన్ని ఉత్పాదకంగా మార్చేలా చేయడం గోల్డ్ బోర్డ్ ముఖ్య ఉద్దేశ్యం.

ఈ గోల్డ్ బోర్డును ఈ ఆర్థిక సంవత్సరమే ఏర్పాటు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొనుగోలుదారులను ఆకర్షించేలా ఈ బోర్డు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు, ప్రతిపాదనల్ని చేయనుంది. అంతేకాకుండా దేశంలో చట్టబద్ధంగా పసిడి నిల్వలు పెంపొందడానికీ కృషి చేస్తుంది.

కాగా, దేవాలయాలు, ట్రస్టుల వద్ద టన్నులకొద్ది బంగారం నిల్వలు ఉంటాయి. వాటి కోసం ప్రత్యేకంగా నియమ నిబంధనలు ఉండనున్నాయని సమాచారం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని లాకర్లలో ఈ బంగారం నిల్వలను భద్రపరుచడం కోసం తగిన మార్గదర్శకాలనూ ఈ బోర్డు జారీ చేయనుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here