ప్రభుత్వ సెలవు దినాల్లో ప్రయివేటు క్లాసులు…

0
5



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో పలు కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయని ఏబివిపి ప్రతినిధులు పేర్కొన్నారు. స్పెషల్‌ క్లాసుల పేరుతో ప్రభుత్వ సెలవు దినాల్లో కళాశాలలు నడుపుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం పలు కళాశాలలను ఏబివిపి ప్రతినిధులు తనికీ చేశారు. ఆయా కళాశాలల్లోని విద్యార్థులను ఇంటికి పంపించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతుల పేరుతో హింసిస్తున్న ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌ఐవోకు విన్నవించారు. ప్రత్యేక తరగతుల పేరుతో చదువు చెప్పడం వల్ల మానసిక ఒత్తిడికి గురై గత ఐదేళ్లలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అనేకమున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం పునరావృతమైతే రాబోయే రోజుల్లో భౌతిక దాడులకు ఏబివిపి సిద్దంగా ఉందని హెచ్చరించారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here