ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని బర్కత్‌పుర కాలనీలో విద్యుత్‌ వైర్లు ప్రమాదకరంగా మారాయి. రోడ్డు మధ్యలో విద్యుత్‌ వైర్లు వేలాడుతూ ఉండడంతో ఏ రోజు ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియక విద్యుత్‌ వినియోగదారులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుచుకుంటున్నారు. వేలాడుతున్న వైర్లను సరిచేయాలని ప్రజలు ఎన్నిసార్లు విద్యుత్‌ అధికారులను విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాడుతున్న వైర్లతో ఏదైనా ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. వేలాడుతున్న వైర్లను తక్షణమే సరి చేయించడంపై ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు దష్టి సారించి ప్రమాదాలు నివారించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. చాలా సంవత్సరాల క్రితం పాతిన విద్యుత్‌ స్తంభాలు దాని ద్వారా కరెంటు సరఫరా చేశారు. అయితే అవి రానురాను విద్యుత్‌ వైర్లు కిందకు వేలాడుతూ తమ చేతులను అందే విధంగా ఉన్నాయని, ఆటో లాంటి చిన్న వాహనాలపై సైతం ఏదైనా సామగ్రి పెట్టి తీసుకు వచ్చినట్లయితే వైర్లు తగిలి వాహనం కాలి పొయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రజలు ద్విచక్రవాహనాలపై వచ్చేటప్పుడు తమ చేతులు పైకి లేపితే వైర్లు తగిలే ప్రమాదముంది. లారీ లాంటి వాహనాలు వేలాడుతున్న విద్యుత్‌ వైర్ల వలన ఇటువైపు రావడం లేదని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here