ప్రమాదవశాత్తు ఒకరి మృతి

0
1


ప్రమాదవశాత్తు ఒకరి మృతి

తాడ్వాయి, న్యూస్‌టుడే: మండల కేంద్రానికి చెందిన జిల్లెల్ల సిద్దిరాములు(45) శనివారం ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై ప్రకాశ్‌ తెలిపారు. తమ వ్యవసాయ క్షేత్రం పక్కనే ఉన్న బావి నుంచి బిందెతో నీళ్లు తీసుకురావడానికి వెళ్లాడన్నారు. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందినట్లు చెప్పారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here