ప్రయాణికుల డిమాండ్లను పరిశీలిస్తాం: రైల్వే డీఆర్‌ఎం

0
2


ప్రయాణికుల డిమాండ్లను పరిశీలిస్తాం: రైల్వే డీఆర్‌ఎం

బోధన్‌ రైల్వే ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌ఎం ఎన్‌.సీతారామ ప్రసాద్‌

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: ప్రయాణికుల డిమాండ్లను పరిశీలిస్తున్నామని హైదరాబాద్‌ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌(డీఆర్‌ఎం) ఎన్‌.సీతారామ ప్రసాద్‌ చెప్పారు. బోధన్‌ రైల్వే స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ సహా రికార్డులు పరిశీలించారు. అనంతరం స్థానికులు, పాత్రికేయులు ప్రస్తావించిన అంశాలపై మాట్లాడారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి అవసరాలపై అధికారులతో చర్చించినట్లు వివరించారు. బోధన్‌ రైల్వే స్టేషన్‌కు గతంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపు అనివార్య కారణాలతో రద్దయిందని తెలిసినట్లు పేర్కొన్నారు. తాజాగా రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలనే డిమాండు ఉందని చెప్పారు. మిర్జాపల్లి రైలు పునరుద్ధరణ కోసం సైతం విజ్ఞప్తులు అందాయన్నారు. అదేవిధంగా గాంధీపార్కు, శక్కర్‌నగర్‌ ప్లాట్‌ఫాంల ఎత్తు పెంపు సైతం తమ దృష్టికి వచ్చిందన్నారు. రాకాసిపేట్‌ స్టేషన్‌లో ఫుట్‌ఒవర్‌ బ్రిడ్జి లేదా అండర్‌పాస్‌ బ్రిడ్జికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రైళ్ల పెంపు, మౌలిక వసతుల కల్పనకు తమ శాఖ అన్ని కోణాల్లో విశ్లేషిస్తుందని తెలిపారు. ప్రయాణికులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేస్తుందన్నారు. అన్నింటిని గమనంలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కొంత సమయం పడుతుందన్నారు. అండర్‌పాస్‌ బ్రిడ్జిల విషయంలో స్థానిక పాలనా యంత్రాంగం నుంచి సైతం చొరవ ఉంటే అనుమతులకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపారు. బోధన్‌ గూడ్సు రైలు ప్లాట్‌ఫాం మరమ్మతుకు ప్రతిపాదనలు చేయిస్తున్నామన్నారు. జానంకపేట్‌లో సైతం గూడ్స్‌ షెడ్‌ ఏర్పాటు పరిశీలనలో ఉందని వివరించారు. ఆయనకు స్థానిక రైల్వే స్టేషన్‌ మాస్టర్లు నితేష్‌, రమేష్‌ స్వాగతం పలికారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here